ధోనీ మేనియా.. దెబ్బకు చెవులు మూసుకున్న రసెల్.. వీడియో ఇదిగో!
- కోల్‌కతాతో మ్యాచ్‌లో ఘటన
- ధోనీ క్రీజులోకి రాగానే ధోనీ.. ధోనీ అంటూ అభిమానుల అరుపులు
- అరుపుల శబ్దం 125 డెసిబుల్స్ దాటిన వైనం
- శబ్దాన్ని భరించలేక చెవులు మూసుకున్న ఆండ్రీ రసెల్
ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సునామీ. ఆ పేరు కనిపించినా, వినిపించినా అభిమానులు పోటెత్తిన సంద్రంలా విరుచుకుపడతారు. కేరింతలు, కరతాళ ధ్వనులతో సునామీ సృష్టిస్తారు. ఐపీఎల్‌లో భాగంగా చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో గత రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే జరిగింది. ధోనీ క్రీజులోకి రాగానే స్టేడియంలోని ప్రేక్షకులు ‘ధోనీ..ధోనీ’ అంటూ అదే పనిగా నినాదాలు చేయడంతో ఆ హోరు ఏకంగా 125 డెసిబుల్స్ దాటిపోయింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌లో ఉన్న ఆండ్రీ రసెల్ ఆ శబ్దాలు వినలేక చెవులు మూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అభిమానుల అరుపుల శబ్దం 125 డెసిబుల్స్ దాటినట్టు బ్రాడ్‌కాస్టర్లు స్క్రీన్‌పై ప్రదర్శించారు. సీఎస్‌కే డ్రెసింగ్ రూము నుంచి ధోనీ బయటకు వచ్చి క్రీజులోకి వెళ్లాక కూడా అభిమానుల కేరింతలు ఆగలేదు సరికదా, మరింత ఎక్కువయ్యాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా వరుస విజయాలకు కళ్లెం వేసిన చెన్నై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో మూడో గెలుపును సొంతం చేసుకుంది. నాలుగు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలోనూ గెలిచిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.