నేటితో ముగుస్తున్న కవిత రిమాండ్.. కోర్టులో హాజరుపరచనున్న ఈడీ
- ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రిమాండ్
- ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత
- కవితకు బెయిల్ నిరాకరించిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. కవితకు కోర్టు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించే అవకాశం ఉంది. మరోవైపు, కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. మరోవైపు, కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.