రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నై సునాయాస విజయం.. ధోనీ రికార్డును సమం చేసిన జడేజా!
- చెన్నైలో సీఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్
- 7 వికెట్ల తేడాతో కోల్‌కతాపై గెలిచిన చెన్నై
- అర్ధశతకం (67 నాటౌట్) తో రాణించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
- ఈ ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు ఇదే తొలి పరాజయం
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సునాయాస విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ అర్ధశతకం (67 నాటౌట్) తో రాణించాడు.
అలాగే శివం దూబే మరోసారి మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఒక బౌండరీ సాయంతో 28 రన్స్ చేశాడు. మరో బ్యాటర్ మిచెల్ 19 బంతుల్లో 25 పరుగులు బాదాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు, నరైన్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు ఇదే తొలి పరాజయం. మరోవైపు చెన్నై మూడో విజయాన్ని నమోదు చేసింది.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. యువ ఆటగాడు రఘువంశీ 24 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. ఇక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులతో రాణించాడు.
రింకూ సింగ్ (09), ఆండ్రీ రసెల్ (10) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారు. ఇక సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. అలాగే తుషార్ దేశ్‌పాండే 3, ముస్తాఫీజుర్ 2, తీక్షణ 1 వికెట్ పడగొట్టారు. మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు 2 అద్భుతమైన క్యాచ్ లు పట్టిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ధోనీ రికార్డును సమం చేసిన జడేజా
మాజీ కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్ ద్వారా రవీంద్ర జడేజా సమం చేశాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన సీఎస్‌కే ప్లేయర్‌గా నిలిచాడు. ధోనీ, జడేజా ఇప్పటివరకు 15 సార్లు ఈ అవార్డ్స్ గెలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), హస్సీ (10) ఉన్నారు.
జడ్డూ పేరిట అరుదైన ఘనత
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కేకేఆర్‌తో మ్యాచులో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచులో రెండు క్యాచ్ లు పట్టడం ద్వారా ఐపీఎల్‌లో 100 క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. దీంతో ముంబై మాజీ సారధి రోహిత్ శర్మతో కలిసి జడేజా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో 110 క్యాచ్ లతో రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103) ఉన్నారు.