క్రోధి నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చంద్రబాబు

  • రేపు తెలుగువారి సంవత్సరాది... ఉగాది
  • శ్రీ క్రోధి నామ సంవత్సర ఆగమనం
  • చెడు అంతా దహనమై చల్లని పాలన ప్రారంభం కావాలన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రేపు (ఏప్రిల్ 9) ఉగాది పర్వదినం నేపథ్యంలో, చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగుపెడుతున్నామని తెలిపారు. 

"క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. అయితే నేడు మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం. ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ... ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


More Telugu News