ఐపీఎల్: కోల్ కతా నైట్ రైడర్స్ జోరుకు చెన్నై అడ్డుకట్ట వేసేనా...?
- ఐపీఎల్ లో నేడు కేకేఆర్ × సీఎస్కే
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్ లో ఈసారి దుమ్మురేపుతున్న జట్లలో కోల్ కతా నైట్ రైడర్స్ ఒకటి. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో వరుసగా మూడు మ్యాచ్ ల్లో నెగ్గి మాంచి ఊపుమీదున్న కోల్ కతా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది. కోల్ కతా ఆటగాళ్లు భీకర ఫామ్ లో ఉన్న నేపథ్యంలో, ఆ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఏమేరకు నిలువరిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
సీఎస్కే టోర్నీలో ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు లెఫ్టార్మ్ పేసర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ అందుబాటులో ఉండడం చెన్నై జట్టుకు కలిసొచ్చే అంశం. శార్దూల్ ఠాకూర్, సమీర్ రిజ్వీ కూడా చెన్నై తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు.
నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఇరుజట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...
కోల్ కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రసెల్, రింకూ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోనీ, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్, రహానే, రవీంద్ర జడేజా, ముస్తాఫిజూర్ రెహ్మాన్.