ఫోన్ ట్యాపింగ్: ఈడీ జాయింట్ డైరెక్టర్‌ను కలిసిన రఘునందన్ రావు

  • మనీలాండరింగ్ కింద వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేయాలన్న రఘునందన్ రావు
  • ఫోన్ ట్యాపింగ్‌లో సూత్రదారులు, పాత్రదారులు ఎవరో తేలాలన్న బీజేపీ నేత
  • రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయాలన్న రఘునందన్ రావు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కింద బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని కోరుతూ బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు సోమవారం ఈడీ జాయింట్ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈడీ దర్యాఫ్తు చేయాలన్నారు. రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారని... ఓటర్లకు డబ్బులు పంపించినట్లుగా ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో ఉందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రదారులు, పాత్రదారులు ఎవరో తేలాలన్నారు. వెంకట్రామిరెడ్డిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేయాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఈడీ జేడీని కలిసి, ఆధారాలు సమర్పించినట్లు చెప్పారు.


More Telugu News