వైసీపీకి మాజీ మంత్రి శమంతకమణి రాజీనామా
- శింగనమల టికెట్ ను ఆశించిన శమంతకమణి కూతురు యామినీ బాల
- వైసీపీ టికెట్ రాకపోవడంతో నిరాశ
- తన కుమారుడితో కలిసి వైసీపీకి రాజీనామా
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీని వీడారు.
శమంతకమణి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1989-91 మధ్య కాలంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో శమంతకమణి కూతురు యామినీబాలకు శింగనమల నియోజకవర్గం నుంచి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో యామినీబాల గెలుపొందారు. అయితే, 2019లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో శమంతకమణి, యామినీబాల, అశోక్ వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వీరు... పార్టీకి గుడ్ బై చెప్పారు.