ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు సంబంధం లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.నవీన్ కుమార్
- తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వ్యాఖ్య
- ఈ కేసులోకి తనను కుట్రపూరితంగా లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
- తన గెస్ట్ హౌస్‌లో ఎలాంటి పోలీసు తనిఖీలు జరగలేదని స్పష్టీకరణ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఈ కేసులోకి తనను కుట్రపూరితంగా లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన గెస్ట్ హౌస్‌లో ఎలాంటి పోలీసు తనిఖీలు జరగలేదని స్పష్టం చేశారు.
ఈ విషయమై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తన గెస్ట్ హౌస్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు... పోలీసు అధికారుల భేటీలు జరిగినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. తనపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.