సన్ స్ట్రోక్ చూశాం.. కానీ జగన్‌కు వైఫ్ స్ట్రోక్ ఉంది: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు
- మూడు రాజధానుల నిర్ణయాన్ని అతిపెద్ద తప్పుగా అభివర్ణించిన గోనె
- ఐదేళ్లలో ఏదైనా కేసులో జగన్ జైలుకు వెళ్తే.. భార్య భారతి సీఎం అయ్యేలా ప్లాన్ చేశారంటూ ఆరోపణ
- భార్య కోసం జగన్ సొంత బంధాలను తెంచేశాడని ప్రకాశ్ రావు ఫైర్
- సీఎం హోదాలో జగన్ పూర్తిగా మద్యం వ్యాపారిలా మారిపోయాడన్న కాంగ్రెస్ నేత
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు అనే నిర్ణయం అతిపెద్ద తప్పు అని అన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఆదుకున్న తల్లి, చెల్లిని అవసరం తీరాక జగన్ గెంటేశాడని ఆరోపించారు. ఐదేళ్లలో ఏదైనా కేసులో జైలుకు వెళ్తే ఆయన భార్య భారతి ముఖ్యమంత్రి అయ్యేలా ప్లాన్ చేశారన్నారు.
భార్య కోసం జగన్ సొంత బంధాలను తెంచేశాడని ప్రకాశ్ రావు ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు సన్ స్ట్రోక్ చూశాం.. కానీ జగన్‌కు వైఫ్ స్ట్రోక్ ఉందన్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిందని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పూర్తిగా మద్యం వ్యాపారిలా మారిపోయాడని ప్రకాశ్ రావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాసిరకం మద్యం తాగి 3,000 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. ఐదేళ్లపాటు యువతకు ఉద్యోగం, ఉపాధి లేకుండా చేశాడని, వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటమి తప్పదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు జోస్యం చెప్పారు.