తెలంగాణలో ఆర్బీ ట్యాక్స్ నడుస్తోంది: బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ఆర్బీ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క ట్యాక్స్ అని ఎద్దేవా
- ఒకరికొకరు మాట్లాడుకొని ఈ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారని విమర్శ
- టోల్ గేట్‌లో వసూలు చేసినట్లుగా కాంట్రాక్టర్ల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న మహేశ్వర్ రెడ్డి
తెలంగాణలో RB ట్యాక్స్ నడుస్తోందని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఆర్బీ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క ట్యాక్స్ అని ఎద్దేవా చేశారు. ఒకరికొకరు మాట్లాడుకొని ఈ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారన్నారు. టోల్ గేట్‌లో వసూలు చేసినట్లుగా కాంట్రాక్టర్ల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని... ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని మండిపడ్డారు. అర్హత కలిగినవారికి రైతుబంధు ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. 13 వారాల్లో వారానికి వెయ్యి కోట్ల చొప్పున 13 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చారని విమర్శించారు. మరో రూ.4 వేల కోట్లు బాండ్ల ద్వారా అప్పులు తెచ్చారన్నారు. అడ్డగోలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శించారు.