మీ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనం.. బీఆర్ఎస్ ట్వీట్!
- తెలంగాణలో కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం ఈ ఢిల్లీ అక్రమ కేసులన్న బీఆర్ఎస్
- అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అయినప్పుడు.. కవిత అరెస్టుపై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడదన్న గులాబీ పార్టీ
- కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంఘీభావం తెలపడంపై బీఆర్ఎస్ ధ్వజం
రాష్ట్రంలోని కాంగ్రెస్-బీజేపీ తీరుపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంఘీభావం తెలియజేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ 'ఎక్స్' (ట్విటర్) వేదికగా ధ్వజమెత్తింది.
తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు ఈ ఢిల్లీ కేసులు నిదర్శనం అని, కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అని కాంగ్రెస్ నేతలే తేల్చి చెబుతున్నారని పేర్కొంది. మరి అదే కేసులో అరెస్టయిన కవిత గురించి కాంగ్రెస్ నేతలు ఒక్కమాట కూడా మాట్లడట్లేదని మండిపడింది. ఈ కాంగ్రెస్-బీజేపీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం అంటూ నిరాహార దీక్ష శిబిరంలో బల్మూరి వెంకట్ మాట్లాడుతున్న పేపర్ క్లిప్పింగ్‌ను తన ట్వీట్‌కు బీఆర్ఎస్ జత చేసింది.