ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు
- కూటమికి 130 నుంచి 145 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయన్న గోనె
- 19 నుంచి 21 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని అంచనా
- పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో గెలుపొందుతారని జోస్యం
ఏపీలో లోక్ సభ, శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచార పర్వంలో తలమునకలై ఉన్నారు. మరోసారి తమదే విజయమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా అంతే ధీమాను వ్యక్తపరుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఏపీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని గోనె ప్రకాశరావు జోస్యం చెప్పారు. బీజేపీతో పొత్తు వల్ల కొంచెం నష్టం ఉన్నప్పటికీ... కూటమిదే గెలుపని ఆయన అన్నారు. కూటమికి 130 నుంచి 145 ఎమ్మెల్యే స్థానాలు... 19 నుంచి 21 లోక్ సభ స్థానాలు వస్తాయని అంచనా వేశారు.
పిఠాపురంలో జనసేన అధినేత 50 నుంచి 60 వేల భారీ మెజార్టీతో గెలుపొందుతారని గోనె చెప్పారు. చివరి నిమిషంలో పవన్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. ఎంపీగా గెలుపొందితే పవన్ కేంద్రంలో కేబినెట్ మినిస్టర్ అవుతారని చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసం పవన్ తన సొంత పార్టీ టికెట్లను కూడా త్యాగం చేస్తున్నారని తెలిపారు. జగన్ మరోసారి సీఎం అయితే ఏపీలో అరాచకత్వం పెరుగుతుందని... అందుకే జగన్ ప్రభుత్వం పోవాలని పవన్ త్యాగం చేస్తున్నారని అన్నారు.