లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ పేరిట అరుదైన రికార్డు!
- ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడిన్ చేసిన బౌలర్‌గా అరుదైన ఘనత
- అలాగే ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి ఫైఫర్ (ఐదు వికెట్ల మార్క్) సాధించిన బౌలర్‌గానూ యశ్
- నిన్నటి గుజరాత్‌తో మ్యాచ్‌లో యశ్ ఠాకూర్ అరుదైన ఘనత
- 5 వికెట్లు తీసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ ఠాకూర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
హోమ్‌గ్రౌండ్‌లో ఆదివారం గుజరాత్ టైటాన్స్ (జీటీ) తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) 33 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో సత్తాచాటి జీటీని ఎల్ఎస్‌జీ చిత్తు చేసింది. దీంతో లక్నో వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇక లక్నో ఈ మ్యాచులో విజయం సాధించడంలో ఆ జట్టు బౌలర్ యశ్ ఠాకూర్‌దే కీరోల్ అని చెప్పాలి. అతడు 5 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చాడు. తన 3.5 ఓవర్ల బౌలింగ్ స్పెల్‌లో కేవలం 30 పరుగులే ఇచ్చి, ఐదు వికెట్లు పడగొట్డాడు.
తద్వారా ఈ యువ బౌలర్ ఈ సీజన్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడిన్ చేసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో యశ్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. అలాగే ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి ఫైఫర్ (ఐదు వికెట్ల మార్క్) సాధించిన బౌలర్‌గానూ నిలిచాడు. ఇక ఐదు వికెట్లు తీసి ఎల్ఎస్‌జీ విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
గిల్‌ను అవుట్ చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది: యశ్ ఠాకూర్
మ్యాచ్ అనంతరం యశ్ ఠాకూర్ మాట్లాడుతూ.. "మ్యాచులో ఐదు వికెట్లు తీయడం ఆనందంగా ఉంది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగా. నా ప్రణాళికకు సారధి కేఎల్ రాహుల్ పూర్తి మద్దతు ఇచ్చాడు. అది విజయవంతమైంది. గిల్‌ను అవుట్ చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక మా యువ బౌలర్ మయాంక్ యాదవ్ గాయపడడం దురదృష్టం. ఐపీఎల్‌లో ఎట్టకేలకు జీటీని ఓడించాం. తొలిసారి ఆ జట్టుపై గెలిచాం" అని చెప్పుకొచ్చాడు.