ఈ విధంగా ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కడే: నారా లోకేశ్

  • మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
  • ఆర్ఆర్ అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖి
  • జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం అంటూ విమర్శలు
  • ప్రజలు ఎదగడం జగన్ కు ఇష్టముండదని వెల్లడి 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇవాళ పాలనుకొండలోని ఆర్ఆర్ అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ, జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం అని విమర్శించారు. తన చుట్టు ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందకూడదని, అక్కడి వారికి ఉద్యోగాలు రాకూడదని... తాను ఇచ్చే పప్పు బెల్లాలపైనే ప్రజలు బతకాలి అనే విధంగా ఓ ఫ్యాక్షనిస్టు ఆలోచిస్తుంటాడని వివరించారు. అలా తనపై ఆధారపడి ఉన్నప్పుడే  తాను చెప్పినట్టు చేస్తారని ఫ్యాక్షనిస్టు భావిస్తుంటాడని అన్నారు. 

"ఏపీలో ఇప్పుడేం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే... అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఈయన బటన్ నొక్కితేనే ప్రజలు బతికే పరిస్థితి నెలకొంది. నిజాం నుంచి చంద్రబాబు వరకు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఇవాళ్టి  రేవంత్ రెడ్డి వరకు ఎవరూ హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు. అంతెందుకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం... అతడెవరంటే... జగన్!" అంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు.


More Telugu News