విశాఖపట్నం-అమృతసర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టిన కారు
- దెబ్బతిన్న పలు కోచ్‌లు
- మూసివున్న క్రాసింగ్ గేట్‌ను ఢీకొట్టి మరీ దూసుకొచ్చిన కారు
- ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్‌లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. విశాఖపట్నం-అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పలు కోచ్‌లు దెబ్బతిన్నాయి. మూసి ఉన్న రైల్వే క్రాసింగ్‌ను ఢీకొట్టి మరీ ముందుకు కారు దూసుకొచ్చిందని అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు శనివారం రాత్రి 7 గంటల సమయంలో మధ్యప్రదేశ్‌లోని బినా ప్రాంతంలో పింప్రి చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. గుర్తించిన అధికారులు వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారి అగర్వాల్ మీడియాకు తెలిపారు. రాత్రి 7 గంటల సమయంలో బినా వైపు వస్తున్న పీసీఎంసీ గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని, ఆర్పివేయడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు.