పాకిస్థాన్ క్రికెటర్లకు ఆర్మీ శిక్షణ.. నెట్టింట వీడియో వైరల్!
- ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో తగ్గేదేలే అంటున్న పాక్ క్రికెట్ బోర్డు
- రెండు వారాల పాటు మిలిటరీ ట్రైనింగ్ క్యాంపు
- కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ క్యాంప్‌లో ఆటగాళ్ల కసరత్తులు
- ట్రెక్కింగ్, రోప్ క్లైంబింగ్ వంటి కఠిన వ్యాయమాలు చేస్తున్న పాక్ క్రికెటర్లు
పాకిస్థాన్ క్రికెటర్ల ఫిట్‌నెస్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2024 సీజన్ ముగిసిన వెంటనే జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంతో కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌కు జట్టు సభ్యులు పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగేలా కాకుల్ ఆర్మీ క్యాంపులో కఠిన శిక్షణ ఇస్తోంది. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు ఫిట్‌నెస్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ పాక్ జట్టు ఘోరంగా విఫలమైంది. దాంతో ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ముగిసిన వెంటనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జాతీయ జట్టులోని సభ్యులతో పాటు ఇతర క్రికెటర్లకు ఆర్మీ ట్రైనింగ్ మొదలెట్టింది.
ఆర్మీ శిక్షణతో ఆటగాళ్ల ఫిట్‌నెస్ మెరుగుపడుతుందని భావించిన పాక్ క్రికెట్ బోర్డు... పాక్ క్రికెటర్లకు సైనికుల నేతృత్వంలో కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపింది. కెప్టెన్ బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణకు పంపింది. తాజాగా ఆటగాళ్ల సైనిక శిక్షణకు సంబంధించిన వీడియోను ఆ జట్టు సభ్యుడు ఇఫ్తికర్ అహ్మద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ క్యాంప్‌లో కసరత్తులు చేస్తున్నారు. బాబర్ అజామ్, రిజ్వాన్‌తో పాటు దాదాపు 30 మంది ఆటగాళ్లు దీనిలో పాల్గొంటున్నారు. ఇక ఈ శిక్షణలో భాగంగా ఆటగాళ్లు ట్రెక్కింగ్, రోప్ క్లైంబింగ్ వంటి కఠిన వ్యాయమాలు చేస్తున్నారు.