968 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. ప్రారంభంలోనే రూ.50 వేల జీతం
- నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ
- డిగ్రీ, డిప్లొమా హోల్డర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. కేంద్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మొదట్లోనే నెలకు రూ.50 వేలు అందుకునే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్‌మెంట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, ఫరక్కా బ్యారేజ్ సర్వీస్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ (సీడబ్ల్యూపీఆర్), డెరెక్టరేట్ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నేవల్), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తదితర సంస్థలలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఖాళీలు:
జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438
జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37
సెంట్రల్ వాటర్ కమిషన్: 12, సెంట్రల్ వాటర్ కమిషన్: 120
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: 121, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: 217 సహా వివిధ శాఖలలో మొత్తం 968 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు:
సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ తత్సమాన విద్యార్హత ఉండాలి. సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు (రిజర్వేషన్ ప్రకారం మినహాయింపు)
జీతభత్యాలు:
రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు
దరఖాస్తులు:
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 18వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I) జూన్ 4 నుంచి జూన్ 6 వరకు నిర్వహిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్:
పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు
సర్టిఫికేట్ వెరిఫికేషన్
మెడికల్ టెస్ట్
పరీక్ష విధానం..
పేపర్–I (ఆబ్జెక్టివ్): 200 మార్కులకు మూడు సబ్జెక్ట్ ల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. రెండు సబ్జెక్టులు అందరికీ కామన్ కాగా మూడోది ఆయా స్పెషలైజేషన్ కు సంబంధించిన సబ్జెక్టు లో నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆబ్జెక్టివ్ విధానంలో సాగే ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతీ తప్పు జవాబుకు 0.25 మార్కులు తగ్గిస్తారు. ఆన్ లైన్ లో జరిగే పరీక్ష ఇది. రిజర్వేషన్ ఆధారంగా ఓసీ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25 శాతం, ఇతరులు 20 శాతం మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు.
పేపర్-2 (డిస్క్రిప్టివ్): జనరల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 300 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్ సైట్ లో సంప్రదించాలి.