ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
- తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఘటన
- పోలీసులు కూంబింగ్ చేస్తుండగా తారసపడిన మావోయిస్టులు
- ఏకే 47, మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం
తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు.
కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకే 47తోపాటు మూడు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. గత సోమవారం చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.