నిప్పుల కుంపటిలా ఏపీ.. ఈ సమయంలో ఎవరూ బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
- రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు
- దేవరాపల్లి, పోరుమామిళ్లలో 44.5 డిగ్రీలు
- నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
- మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 దాటేవరకు బయటకు రావొద్దని హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. చాలావరకు జిల్లాల్లో నిన్న 42 డిగ్రీలకుపైనే నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. నిన్న అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ తొలివారంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే మే నెల పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. అలాగే, ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు దాటే వరకు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీచేసింది.