బీ అలర్ట్.. నేడు, రేపు వడగాల్పులు

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
  • 7, 8 తేదీల్లో అక్కడక్కడా వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడి
  • అంచనా వేసిన భారత వాతావరణ విభాగం
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. శని, ఆదివారాల్లో పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, తెలంగాణ, యానాం తీర ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని గంగానది పరివాహక ప్రాంతం, బీహార్, జార్ఖండ్, ఉత్తర కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలోని విదర్భతో సహా పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

అయితే ఏప్రిల్ 7, 8 తేదీల్లో వడగాల్పులతో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో వడగళ్ళు కురుస్తాయని పేర్కొంది. కాగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే.


More Telugu News