ఉప్పల్ లో సన్ రైజర్స్, చెన్నై పోరు... టాస్ మనదే... మరి మ్యాచ్?
- ఐపీఎల్ లో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- హైదరాబాదు జట్టులో నితీశ్ రెడ్డికి స్థానం
ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. సొంతగడ్డ ఉప్పల్ లో ఈ మ్యాచ్ ఆడుతుండడంతో సన్ రైజర్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే సన్ రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆడడంలేదని, అతడి స్థానంలో నితీశ్ రెడ్డికి తుది జట్టులో అవకాశం ఇచ్చామని టాస్ సందర్భంగా కమిన్స్ వెల్లడించాడు. చివరిసారిగా ఉప్పల్ స్టేడియంలో 500కి పైగా పరుగులు నమోదయ్యాయని, ఈసారి కూడా పిచ్ అనుకూలిస్తుందని భావిస్తున్నామని తెలిపాడు.
ఇక, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. మొయిన్ అలీ, మహీశ్ తీక్షణ, ముఖేశ్ చౌదరి బరిలో దిగుతున్నారని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు.
ఈ టోర్నీలో ఇప్పటివరకు చెన్నై జట్టు 3 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సన్ రైజర్స్ 3 మ్యాచ్ లు ఆడి కేవలం ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ఇరుజట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...
సన్ రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, క్లాసెన్, మార్ క్రమ్, అభిషేక్ శర్మ, జయదేవ్ ఉనద్కట్, భువనేశ్వర్ కుమార్.
చెన్నై సూపర్ కింగ్స్: మహేంద్ర సింగ్ ధోనీ, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా.