ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 21 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 1 పాయింట్ కోల్పోయిన నిఫ్టీ
- 2 శాతానికి పైగా లాభపడ్డ కోటక్ బ్యాంక్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం సూచీలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 74,248కి చేరుకుంది. నిఫ్టీ 1 పాయింట్ కోల్పోయి 22,513 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (2.09%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.56%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.41%), ఐటీసీ (1.21%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.67%).
టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-1.82%), ఎల్ అండ్ టీ (-1.54%), భారతి ఎయిర్ టెల్ (-1.28%), బజాజ్ ఫైనాన్స్ (-1.25%), మారుతి (-1.21%).