లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన గుంటూరు నేత తాడిశెట్టి మురళి
- నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో భారీగా చేరికలు
- టీడీపీ తీర్థం పుచ్చుకున్న గుంటూరు, అనంతపురం జిల్లాల నేతలు
- పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికిన నారా లోకేశ్
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీలలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. గుంటూరుకు చెందిన తాడిశెట్టి మురళీమోహన్ నేడు లోకేశ్ సమక్షంలో కుటుంబ సభ్యులతో సహా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేసిన తాడిశెట్టి వెంకట్రావు సోదరుడే తాడిశెట్టి మురళి. మురళి గతంలో డిప్యూటీ మేయర్ గా వ్యవహరించారు. ఇటీవలే తాడిశెట్టి బ్రదర్స్ వైసీపీకి గుడ్ బై చెప్పారు.
ఇవాళ లోకేశ్ సమక్షంలో తాడిశెట్టి మురళీమోహన్, ఆయన అనుయాయులు పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వచ్చారు. వారందరికీ టీడీపీ కండువాలు కప్పిన లోకేశ్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, వైసీపీ ఏపీని ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి ఇప్పుడే వచ్చింది అని వ్యాఖ్యానించారు. ప్రజలు తమవైపే ఉన్నారని, తమ మేనిఫెస్టోలోని సూపర్-6 పథకాలను తప్పక అమలు చేస్తామని అన్నారు.