విజయవాడలో సమావేశమైన ఎన్డీయే కూటమి నేతలు

  • విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థుల హాజరు
  • అభ్యర్థుల గెలుపు, పార్టీల మధ్య సమన్వయంపై చర్చ
  • జగన్ పై ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందన్న సుజనా చౌదరి
ఎన్డీయే కూటమి నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. విజయవాడ లోక్ సభ పరిధిలోని అభ్యర్థులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. 7 అసెంబ్లీ నియోజకర్గాల అభ్యర్థులు, ఇన్ఛార్జ్ లు, జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుపై, పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై వీరు చర్చలు జరిపారు. 

ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించుకుంటున్నామని చెప్పారు. సీఎం జగన్ పై ప్రజలు తిరగబడే పరిస్థితులు ఉన్నాయని సుజనా చౌదరి అన్నారు. రాజధానిని నాశనం చేసి, ఈ ప్రాంత అభివృద్ధికి తూట్లు పొడిచారని విమర్శించారు. ప్రజలు తిరగబడే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడం కూటమితోనే సాధ్యమని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా ఫేక్ పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.


More Telugu News