నా ఫోన్ ను కూడా ట్యాప్ చేశారు: కిషన్ రెడ్డి

  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలన్న కిషన్ రెడ్డి
  • ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
  • ఈ వ్యవహారాన్ని బీజేపీ వదిలిపెట్టదని వ్యాఖ్య
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సమయంలో తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలి పెట్టినా... బీజేపీ వదలదని అన్నారు. రైతులకు కొత్త రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని విమర్శించారు.


More Telugu News