600 మంది ఉద్యోగులను తొలగించిన యాపిల్ కంపెనీ
- కార్లు, స్మార్ట్‌వాచ్ ప్రాజెక్ట్‌ల నిలిపివేత నేపథ్యంలో నిర్ణయం
- కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు తెలిపిన కంపెనీ
- మరికొంత మంది ఉద్యోగులను వేరే టీమ్‌లలో కలిపిన యాపిల్
అమెరికాకు చెందిన బహుళజాతి టెక్ కంపెనీ ‘యాపిల్’ 600 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కారు, స్మార్ట్‌వాచ్ డిస్ ప్లే ప్రాజెక్టులను నిలిపివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న యాపిల్ విభాగం ‘కుపెర్టినో’ ఎనిమిది వేర్వేరు రిపోర్టుల ద్వారా విషయాన్ని తెలియజేసింది. వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వివరించింది. ఉద్యోగులను తొలగించే కంపెనీలు ప్రభుత్వ ఏజెన్సీకి తప్పనిసరిగా రిపోర్ట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే యాపిల్ కంపెనీ సమాచారం తెలియజేసింది.
కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న ప్రధాన కార్యాలయంలో 371 మంది ఉద్యోగులను తొలగించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలు శాటిలైట్ ఆఫీస్‌లలో డజన్ల సంఖ్యలో ఉద్యోగులు ప్రభావితమయ్యారని తెలిపాయి. మరికొంతమందిని వేరు టీమ్‌లలోకి పంపించారు. అయితే తాజా నిర్ణయంతో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే అంశంపై స్పందించేందుకు యాపిల్ ప్రతినిధి నిరాకరించారు.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో కార్లు, స్మార్ట్‌వాచ్ ప్రాజెక్ట్‌ల నిలిపివేత ప్రక్రియను యాపిల్ కంపెనీ ప్రారంభించింది. ప్రాజెక్టుల వ్యయాలు, నిర్వహణ సవాళ్లపై ఆందోళనల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.