సీబీఐ డైరెక్టర్ కూడా బీజేపీ టికెట్‌పై బరిలోకి దిగుతారామో?.. టీఎంసీ నేత మహువా మొయిత్రా ఎటాక్

  • 400 స్థానాల్లో గెలుస్తామన్న బీజేపీ.. కేజ్రీవాల్, హేమంత్‌ సోరెన్‌ను చూసి భయపడుతోందన్న టీఎంసీ నేత
  • ఎంపీగా తన బహిష్కరణ బీజేపీ హయాంలో తనకు దక్కిన గౌరవమని స్పష్టీకరణ
  • బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన జడ్జి ఇప్పుడు బీజేపీతో ఉన్నారని గుర్తుచేసిన నేత
తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన మహువా మెయిత్రా బీజేపీపై మరోసారి దాడి ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుస్తానని డాంబికాలు పలుకుతున్న బీజేపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. హేమంత్ సోరెన్, కేజ్రీవాల్‌ను భయంతోనే అరెస్ట్ చేసిందని ఆరోపించారు. 

ఎంపీగా తనను బహిష్కరించడం బీజేపీ హయాంలో తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్న మెయిత్రా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తన కోసం ఈడీ, సీబీఐ వచ్చినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన హైకోర్టు జడ్జి ఇప్పుడు బీజేపీతోనే ఉన్నారన్న ఆమె.. సీబీఐ డైరెక్టర్ వీఆర్ఎస్ తీసుకుని బీజేపీ తరపున పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు.


More Telugu News