తైవాన్ భూకంప సమయంలో కనిపించకుండా పోయిన భారతీయుల క్షేమం
- గురువారం విదేశాంగ శాఖ ప్రకటన
- భూకంపం సమయంలో కొంత సేపు వారితో సంబంధాలు తెగిపోయాయని వెల్లడి
- ఇటీవలే వారితో మాట్లాడామని, వారిద్దరూ క్షేమంగానే ఉన్నారని ప్రకటన
తైవాన్ భూకంపం సమయంలో కనిపించకుండా పోయిన భారతీయులు క్షేమంగానే ఉన్నారని విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ‘‘భూకంప సమయంలో ఇద్దరు భారతీయులతో సంబంధాలు తెగిపోయాయి. వారితో ఇటీవలే మాట్లాడాము. వారు క్షేమంగా ఉన్నారు’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
తైవాన్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. హువెలిన్ కౌంటీలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా సుమారు 10 మంది మరణించగా వందల సంఖ్కలో ప్రజలు గాయపడ్డారు. మరో 12 మంది ఆచూకీ కోసం విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
భూకంపం కారణంగా తైవాన్‌లో పలు భవనాలు పక్కకు ఒరిగిపోయాయి. భూకంపానికి ఊగిపోతున్న భవంతులు, బ్రిడ్జీలు, ప్రజల హాహాకారాల తాలూకు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రెండు భూపలకాల సరిహద్దులో ఉండే తైవాన్‌లో భూకంపాలు సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు.