సీఎం జగన్ పై వ్యాఖ్యలు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

  • మార్చి 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో పాల్గొన్న చంద్రబాబు
  • సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సీఈవోకు వైసీపీ నేతల ఫిర్యాదు
  • ముఖేశ్ కుమార్ మీనాను కలిసిన వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మిగనూరు, బాపట్ల, మార్కాపురం సభల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం నేడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. 

చంద్రబాబు ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచార యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 31న ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం, బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రజాగళం సభలకు హాజరయ్యారు.


More Telugu News