రేపు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ పొలంబాట
- రేపు ఉదయం 8.30 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరనున్న కేసీఆర్
- పదిన్నర గంటలకు ముక్దుంపూర్ చేరుకొని ఎండిపోయిన పంటల పరిశీలన
- మధ్యాహ్నం గంగుల కమలాకర్ ఇంట్లో లంచ్
- బోయినపల్లి, శాభాష్‌పల్లి గ్రామాల్లో పంట పరిశీలన
- రాత్రి 7 గంటలకు ఫామ్ హౌస్ చేరుకోనున్న కేసీఆర్
పొలంబాటలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల జనగామ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఇప్పుడు రేపటి పొలంబాట షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 8.30 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరుతారు. పదిన్నర గంటలకు ముక్దుంపూర్ చేరుకొని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో లంచ్ చేస్తారు. రెండు గంటలకు రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లికి చేరుకొని... ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. శాభాష్‌పల్లి వద్ద మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు సిరిసిల్ల నుంచి బయలుదేరి రాత్రి రాత్రి 7 గంటల వరకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకుంటారు.