మోదీ స్టేడియంలో అమీతుమీ... గుజరాత్ పై టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్
- ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్ × పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
- ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న కేన్ విలియమ్సన్
- మిల్లర్ కు గాయం... గుజరాత్ టైటాన్స్ జట్టులో విలియమ్సన్ కు స్థానం
ఐపీఎల్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్ స్టన్ స్థానంలో ఆల్ రౌండర్ సికందర్ రజాకు స్థానం కల్పించారు. అటు, ఈ సీజన్ లో కేన్ విలియమ్సన్ తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టులో డేవిడ్ మిల్లర్ గాయంతో బాధపడుతుండడంతో, అతడి స్థానంలో కేన్ విలియమ్సన్ కు తుది జట్టులో చోటిచ్చారు.
టోర్నీలో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ 3 మ్యాచ్ లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్ లు ఆడి 1 మ్యాచ్ నెగ్గింది.
ఇరు జట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...
గుజరాత్ టైటాన్స్: శుభ్ మాన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, వృద్ధిమాన్ సాహా.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, బెయిర్ స్టో, జితేశ్ శర్మ, శామ్ కరన్, సికందర్ రజా, కగిసో రబాడా, అర్షదీప్ సింగ్.