ఫోన్ ట్యాపింగ్ ద్వారా అతిపెద్ద స్కాం జరిగింది: వీహెచ్
- ఫోన్ ట్యాపింగ్ దేశంలోనే సంచలనంగా మారిందన్న వీహెచ్
- తప్పు చేసిన వారు ఎంతటివారైనా ప్రభుత్వం వదిలి పెట్టదని హెచ్చరిక
- నయీం కేసును మళ్లీ విచారణ చేపట్టాలన్న వీహెచ్
ఫోన్ ట్యాపింగ్ ద్వారా అతిపెద్ద స్కాం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. ఈ అంశం ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారిందన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేసిన వారు ఎంతటివారైనా ప్రభుత్వం వదిలి పెట్టదని హెచ్చరించారు.
నయీమ్ కేసును మళ్లీ విచారణ చేపట్టాలని వీహెచ్ డిమాండ్ చేశారు. నయీమ్ కేసులో ఉన్న నాయకులు, పోలీసు అధికారులు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నయీంకు చెందిన వందల కోట్ల ఎకరాలు, పేదల భూములు ఎక్కడకు పోయాయి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నయీం కేసును నీరుగార్చిందని ఆరోపించారు.