100 కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతున్న 'టిల్లు స్క్వైర్'
- మార్చి 29వ తేదీన విడుదలైన 'టిల్లు స్క్వైర్'
- నిన్నటితో 6 రోజుల పూర్తి
- 6 రోజుల వసూళ్లు 91 కోట్ల గ్రాస్
- 'టిల్లు 3' ఉంటుందని చెప్పిన సిద్ధూ
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా కొంతకాలం క్రితం వచ్చిన 'డీజే టిల్లు' యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'టిల్లు స్క్వైర్' మార్చి 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఫస్టు పార్టు స్థాయిలో సెకండ్ పార్టు సక్సెస్ అయ్యేనా అనేది అందరిలో ఆసక్తిని పెంచింది.
అయితే ఈ సినిమా కూడా తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ఫస్టు పార్ధుకి ఎంతమాత్రం తగ్గని ఎంటర్టైన్మెంట్ ను అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కామెడీ కంటెంట్ .. అందుకు తగిన సంభాషణలు ఈ సినిమా సక్సెస్ లో ముఖ్యమైన పాత్రను పోషించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది.
ఈ సినిమా విడుదలై నిన్నటితో 6 రోజులైంది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమా 91 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అంటే ఈ గురు - శుక్రవారాల్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక 'టిల్లు 3' కూడా ఉంటుందనీ, ఈ సారి హీరో ఇంకా పెద్ద సమస్యలో చిక్కుకుంటాడని సిద్ధూ చెప్పడం అందరిలో ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది.