రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిని మార్చిన పవన్ కల్యాణ్... అరవ శ్రీధర్ కు టికెట్

  • రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిగా తొలుత యనమల భాస్కర్ రావు పేరు ప్రకటన
  • క్షేత్రస్థాయిలో నివేదికలు, నేతల అభిప్రాయాలతో మనసు మార్చుకున్న పవన్
  • మూడ్రోజుల కిందటే పార్టీలో చేరిన అరవ శ్రీధర్ కు అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం
  • ముక్కావారిపల్లె సర్పంచిగా ఉన్న అరవ శ్రీధర్
ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును జనసేనాని పవన్ కల్యాణ్ నేడు ప్రకటించారు. వాస్తవానికి రైల్వే కోడూరు అభ్యర్థిగా తొలుత యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పవన్ కల్యాణ్, ఇతర జనసేన అగ్రనేతలు పరిశీలించారు. 

రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ వర్గాలతో చర్చించిన పవన్...  రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అరవ శ్రీధర్ ను రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. 

అరవ శ్రీధర్ మూడ్రోజుల కిందటే తన అనుచరులతో సహా జనసేనలో చేరారు. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్ గా ఉన్నారు.


More Telugu News