శోభన్ బాబుగారిని నేను తలచుకోని రోజుండదు: సీనియర్ హీరోయిన్ రాధ
- 1980లలో ఒక వెలుగు వెలిగిన రాధ
- డాన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్
- హెల్త్ గురించి శోభన్ బాబు చెప్పేవారని వెల్లడి
- ఆయన మాట వినిపించుకోలేదని నిట్టూర్పు
1980లలో తెలుగు తెరపై సందడి చేసిన అందమైన కథానాయికలలో రాధ ఒకరు. అప్పట్లో చిరంజీవి సరసన డాన్స్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసిన నాయిక ఆమె. విజయశాంతి .. రాధిక .. సుహాసిని వంటి నాయికల పోటీని తట్టుకుని నిలబడిన ప్రత్యేకత ఆమె సొంతం. అలాంటి రాధ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మెరిశారు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఒకప్పటికంటే రాధ ఇప్పుడు బాగా బరువు పెరిగిపోయారు. అదే విషయాన్ని గురించి అలీ ఆమెను అడిగారు. అప్పుడు ఆమె శోభన్ బాబును గురించి ప్రస్తావించారు. "శోభన్ బాబుగారితో నా ఫస్టు మూవీ 'అడవిరాజా'. ఆ సినిమా కోసం ఒకసారి ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. కూర్చుని లేచి చేసే స్టెప్ ఒకటి ఉంది. అది శోభన్ బాబుగారు చేసేశారు. నేను కూడా అలాగే చేశాను.
అప్పుడు శోభన్ బాబు గారు .. "ఒకసారి కూర్చుని ఏమీ పట్టుకోకుండా పైకి లేవమన్నారు. నేను చాలా ఈజీగా చేశాను. 40 తరువాత కూడా అలా లేవగలిగితే అప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు అని ఆయన చెప్పారు. ఆ మాటలను నేను అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ఆయనను తలచుకోని రోజు లేదు. ఆయనన్న మాట రోజూ గుర్తొస్తూనే ఉంటుంది. ఊటీలో అంత చలిలోనూ ఆయన ఉదయాన్నే వాకింగ్ చేసేవారు. ఆయన మాట వినకపోవడం వలన ఈ రోజున పైకి లేవడానికి ఇబ్బంది పడుతున్నాను" అని చెప్పారు.