పార్టీ మార్పు ఊహాగానాలపై తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

  • ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేసిన గంగుల
  • తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • కేసీఆర్ రంగంలోకి దిగాకే కాల్వల్లోకి నీళ్లు వస్తున్నాయన్న ఎమ్మెల్యే
తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలను మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఖండించారు. ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. రానున్న ఎన్నిల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్న ప్రచారంపై గంగుల మాట్లాడుతూ.. ఆ విషయం జూన్ 4న తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ పక్షానే నిలబడతామని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వారిని ఆదుకోవాలని గంగుల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రైతులు అవస్థలు పడుతున్నారని, అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారని పేర్కొన్నారు. కేసీఆర్ పర్యటన తర్వాతే కాల్వల్లోకి నీళ్లు వస్తున్నాయని గంగుల తెలిపారు.


More Telugu News