జూనియర్ కాలేజీలలో అడ్మిషన్ ఇప్పుడే తీసుకోకండి.. తల్లిదండ్రులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ సూచన
- అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదని వెల్లడి
- అనధికారికంగా అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఫిర్యాదులు
- గుర్తింపు పొందిన కాలేజీల వివరాలు ప్రకటించాకే పిల్లలను చేర్చాలని సూచన
తెలంగాణలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ఇప్పుడే అడ్మిషన్ తీసుకోవద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఇంటర్ బోర్డ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2024–25 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ షెడ్యూల్ చేయలేదని తెలిపింది. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ప్రకటించాకే మీ పిల్లలను కాలేజీలలో చేర్పించాలని సూచించింది. అనధికారికంగా కొన్ని కాలేజీలు ఇటీవల అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ ప్రకటనలో తెలిపింది.
ఆయా కాలేజీలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈమేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను tsbie.cgg.gov.in, acadtsbie.cgg.gov.in వెబ్ సైట్లలో పెడతామని, వాటిల్లో మాత్రమే చేరాలని ఓజా సూచించారు.