ఎన్నికల నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష
- వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్
- అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లతో సమీక్ష
- తెలంగాణలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన సీఎస్ శాంతికుమారి
లోక్ సభ ఎన్నికల నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలపై సూచనలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ... రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాలపై ఛత్తీస్‌గఢ్ సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.