లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ కీలక నిర్ణయం

  • పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రైల్వే, పెట్రోలియం సంస్థల్లో ఓటర్ అవగాహన కార్యక్రమాలు 
  • బీఆర్‌కే భవన్‪లో ఓటర్ అవేర్‌నెస్ పోస్టర్‌ విడుదల
  • తెలంగాణవ్యాప్తంగా నిఘా విస్తృతం చేస్తున్నట్లు తెలిపిన సీఈఓ వికాస్‌రాజ్
లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం తెలంగాణలో పలు కీలక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బీఆర్‌కే భవన్‪లో ఓటర్ అవేర్‌నెస్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రైల్వే, పెట్రోలియం సంస్థల్లో ఓటర్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా నిఘా విస్తృతం చేస్తున్నట్లు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలింపు, నిల్వలపై నిఘా పెంచాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఆయన ఇదివరకే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


More Telugu News