ఏఐ ఫీచర్లతో మోటరోలా నుంచి ‘ఎడ్జ్ 50 ప్రో’ ఫోన్ విడుదల

  • ఏఐ ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్
  • ఆరంభ ధర రూ.31,999.. గరిష్ఠ ధర రూ.35,999
  • ఏప్రిల్ 9 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఫోన్లు
స్మార్ట్‌ఫోన్ల తయారీ ప్రముఖ కంపెనీ మోటరోలా ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా ఇటీవల ‘మోటరోలా ఎడ్జ్ 50 ప్రో’ ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. మిడ్-బడ్జెట్ ధరలతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌లో ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.  ఏప్రిల్ 9, 2024న మార్కెట్లోకి రాబోతున్న ఈ ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ కెపాసిటీని కలిగివుంది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభించనుంది. 8జీబీ ర్యామ్, 256జీ స్టోరే.. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ కాంబినేషన్లలో అందుబాటులో ఉండనున్నాయి. బేస్ వేరియెంట్ ధర రూ. 31,999 కాగా మరో వేరియెంట్ ధర రూ. 35,999గా ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ ధరల శ్రేణిలో ప్రధాన పోటీదారులైన వన్‌ప్లస్, సామ్‌సంగ్ అందిస్తున్న ఫోన్లతో పోల్చితే ప్రీమియం ఫీచర్లు గ్యారంటీ అని కంపెనీ హామీ ఇస్తోంది. బ్లాక్ బ్యూటీ, మూన్‌లైట్ పెర్ల్, లక్స్ లావెండర్ అనే 3 రంగుల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఫోన్‌ కొనుగోలుపై రూ. 2,000 వరకు తక్షణ తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. 

ఫీచర్లు ఇవే..
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ 6.7 అంగుళాల పొడవు ఉంటుంది. 1.5కే కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే, పూర్తి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ సపోర్ట్, క్వాల్‌‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్‌‌తో తయారు చేశారు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్ సీ సపోర్ట్‌తో 125వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు కూడా అవకాశం ఉంది.


More Telugu News