పరిపాలన తన చేతుల్లో లేదన్నప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ ఎందుకు?: కేటీఆర్ ఎద్దేవా
- తాత్కాలికంగా రెండు నెలల పాటు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం సమన్వయం చేస్తుందని వెల్లడి
- పరిపాలన అనుభవం లేక అది కూడా రేవంత్ రెడ్డికి తెలియదని ఎద్దేవా
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీజేపీ సహకరించింది... ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్‌కు సహకరిస్తోందని వ్యాఖ్య
'సిగ్గుచేటు ఏమిటంటే, పరిపాలన నా చేతుల్లో లేదు... ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని నిన్న రేవంత్ రెడ్డి అన్నారు. మరి ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు? పరిపాలన అల్టిమేట్‌గా సీఎం చేతుల్లోనే ఉంటుంది. తాత్కాలికంగా రెండు నెలల పాటు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం సమన్వయం చేస్తుంది. అది కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. పరిపాలన అనుభవం లేదు కదా' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిపాలన తన చేతుల్లో లేదనడం చాలా చిల్లరగా ఉందన్నారు.
వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ... గతంలో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతావని అడిగితే సీఎం పదవి గుంపు మేస్త్రీ పదవి అని చెప్పారని గుర్తు చేశారు. ఇక ప్రధానమంత్రేమో తాపీ మేస్త్రీ... ఇద్దరూ కలిసి తెలంగాణకు సమాధి కట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణ పార్టీకి సమాధి కట్టాలని ఇద్దరు కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు.
ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీజేపీవాళ్లు సహకరించారని... ఈరోజు బీజేపీకి కాంగ్రెస్ నాయకులు సహకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని తెలుసుకుని... నిన్న మొన్నటిదాకా ఇంఛార్జిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తప్పుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉండి సీటు ఓడిపోతే పరువు పోతుందని గ్రహించి జారుకున్నాడని ఎద్దేవా చేశారు. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ తప్పకుండా గెలుస్తున్నాడన్నారు. మన పార్టీని ఖతం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి కండువా కప్పించుకుంటున్నారని విమర్శించారు.