స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 27 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 18 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.60 శాతం పడిపోయిన నెస్లే ఇండియా షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. ఈరోజు మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 73,876కు పడిపోయింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 22,434 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (1.97%), టెక్ మహీంద్రా (1.75%), టీసీఎస్ (1.67%), భారతి ఎయిర్ టెల్ (1.41%), బజాజ్ ఫైనాన్స్ (1.38%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-2.62%), కోటక్ బ్యాంక్ (-1.43%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.35%), టైటాన్ (-1.16%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.08%).    



More Telugu News