రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ
- రైతులకు వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నేత డిమాండ్
- రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు డిసెంబర్ 9న రుణమాఫీ కాలేదన్న హరీశ్‌రావు
- పంట మద్దతు ధరపై రూ. 500 బోనస్.. ఎకరానికి రూ. 15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేయాలన్న మాజీ మంత్రి
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు రైతుల రుణమాఫీ విషయమై బహిరంగ లేఖ రాశారు. రైతులకు వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9వ తేదీనే చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ. 2 లక్షలు రుణం తీసుకోవాలన్నారని, రేవంత్ మాటలు నమ్మి చాలా మంది అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు.
"రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు డిసెంబర్ 9న రుణమాఫీ కాలేదు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క రైతుకు రుణమాఫీ అందలేదు. దీన్ని ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలి. సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల కాలంలో 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన దుస్థితి. పంట మద్దతు ధరపై రూ. 500 బోనస్ ఇవ్వాలి. అలాగే ఎకరానికి రూ. 15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేయాలి" అని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు.