డికాక్, పూరన్ మాస్ కొట్టుడు... లక్నో భారీ స్కోరు

  • ఐపీఎల్ లో లక్నో వర్సెస్ ఆర్సీబీ
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్, మిడిలార్డర్ బ్యాటర్ నికోలాస్ పూరన్ దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరూ బ్యాట్లు ఝళిపించడంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. 

డికాక్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 81 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. చివర్లో పూరన్ 21 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పూరన్ 1 ఫోర్, 5 భారీ సిక్సులు కొట్టాడు. 

అంతకుముందు, కెప్టెన్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 2 సిక్సులతో 20 పరుగులు చేయగా, ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 24 పరుగులు సాధించాడు. బెంగళూరు బౌలర్లలో మ్యాక్స్ వెల్ 2, రీస్ టాప్లే 1, యశ్ దయాళ్ 1, సిరాజ్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, లక్ష్యఛేదనలో బెంగళూరు జట్టు 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కోహ్లీ 18, డుప్లెసిస్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ గెలవాలంటే ఇంకా 16 ఓవర్లలో 146 పరుగులు చేయాలి.


More Telugu News