ఏప్రిల్ 9న ఉగాది... తిరుమల ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- ఉగాదిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేసిన అర్చకులు
- ఆగమశాస్త్ర ప్రకారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేత
ఏప్రిల్ 9న తెలుగు సంవత్సరాది ఉగాది ఆగమనం చేస్తోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ ఉదయం ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు.
శ్రీవారి సన్నిధిలోని ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, స్వామి వారి ఆలయం లోపల ఉన్న ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, ఆలయ పైకప్పు, స్వామివారి పూజా సామగ్రి... అన్నింటిని జల సంప్రోక్షణ చేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో వెంకటేశ్వరస్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు.