సుప్రీంకోర్టుకు హాజరైన బాబా రాందేవ్
- వినియోగదారులను తప్పుదోవ పట్టించే యాడ్స్ కేసు
- రాందేవ్ బాబా, పతంజలి ఎండీ బాలకృష్ణలకు సుప్రీంకోర్టు సమన్లు
- ధర్మాసనం ఆదేశాలతో సుప్రీంకోర్టుకు వచ్చిన బాబా రాందేవ్
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారులను తప్పుదోవ పట్టించిన యాడ్స్ కేసులో ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి చివరి వాదనల సందర్భంగా బాబా రాందేవ్ తో పాటు, పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ (ఈరోజు) సందర్భంగా తమ ముందు హాజరు కావాలని వారిని ఆదేశించింది.
టీవీ, పత్రికల్లో వెంటనే యాడ్స్ ను ఆపేయాలంటూ ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ పై కేంద్రం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.