అమెరికా ‘డెవిన్’కు సవాల్ విసరనున్న మన దేశీ ఏఐ ఇంజనీర్ 'దేవిక'
- సొంతంగా కోడింగ్ రాసుకోగల దేవిక
- క్లాడ్ 3 జీపీటీ 4 , జీపీటీ 3.5 లోకల్ ఎల్ఎల్ఎమ్స్ వయా ఒల్లామాను సపోర్ట్ చేస్తుంది
- ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందన్న నిర్వాహకులు
అమెరికాకు చెందిన కాగ్నిషన్ ల్యాబ్స్ ఇటీవల రూపొందించిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డెవిన్ కు పోటీగా భారత్ నుంచి దేశీ వర్షన్ దేవిక వచ్చేసింది! ‘డెవిన్’ సామర్య్థాలను సవాల్ చేసేందుకు లిమినల్ అండ్ స్టిషన్.ఏఐకు చెందిన ముఫీద్ వీహెచ్ (హజ్మాకుట్టి) దీన్ని రూపొందించారు.
దేవిక ఒక ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్. మనుషుల నుంచి అందే ఆదేశాలను అర్థం చేసుకొనేందుకు ‘డెవిన్’ లాగానే ఇది కూడా మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ)పై ఆధారపడుతుంది. అయితే ఆ ఆదేశాలను కార్యరూపంలోకి విభజించుకొని ఆ తర్వాత సొంతంగా పరిశోధించి నిర్దేశిత లక్ష్యాలను అందుకొనేందుకు కోడ్ రాసుకుంటుంది. ఆపై దాన్ని రన్ చేసి చూసుకుంటుంది.
ఒకవేళ కోడ్ లో ఏమైనా తప్పులు దొర్లితే ఎవరి సాయం లేకుండానే దాన్ని సరిచేసుకుంటుంది. ఇది క్లాడ్ 3 జీపీటీ 4 , జీపీటీ 3.5 లోకల్ ఎల్ఎల్ఎమ్స్ వయా ఒల్లామాను సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం దేవిక టెస్టింగ్ దశలో ఉందని, టెస్టర్లు ఎవరైనా తమ ప్రాజెక్టులో పాలుపంచుకోవచ్చని ముఫీద్ వీహెచ్ ‘ఎక్స్’ వేదికగా ఆహ్వానించారు. పూర్తిస్థాయిలో టెస్టింగ్, బగ్ ఫిక్సేషన్ జరిగాక ‘దేవిక’ను అధికారికంగా విడుదల చేస్తామని పేర్కొన్నారు.
టెక్కీల కొలువులపై ప్రభావం ఉంటుందా?
సాఫ్ట్ వేర్ డెవలపర్లకు సహకార భాగస్వామిగా నిలవడంలో ఇది దోహదపడుతుంది. డెవిన్ పనితీరుపై నిర్వాహకులు గోప్యత పాటిస్తుండగా ఓపెన్ సోర్స్ గా రూపొందిన దేవిక మరింత పారదర్శకతకు చోటివ్వనుంది. తద్వారా దీన్ని మరింతగా మార్చేందుకు ఇది దోహదపడనుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ.. టెక్కీల జాబ్ మార్కెట్ ను ఏఐ టూల్స్ ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాల్సి ఉంది. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. అది ఏమిటంటే, కోడింగ్ భవితవ్యం భారీ మార్పులకు గురికానుంది.