వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య
- రెండు పేర్లతో మరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
- మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్‌కు టిక్కెట్
- నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన కావ్యకు వరంగల్ టిక్కెట్
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించింది. సోమవారం సాయంత్రం ఇద్దరు అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో మహారాష్ట్రలోని అకోలా నియోజకవర్గం నుంచి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్‌కు టిక్కెట్ కేటాయించింది. తెలంగాణలోని వరంగల్ నుంచి కావ్య పేరును ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాలకు ప్రకటించాల్సి ఉంది.
ఈ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. వరంగల్ టిక్కెట్‌ను కడియం కావ్యకు ఖరారు చేశారు. మిగిలిన మూడు స్థానాలలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కడియం కావ్య నిన్న తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు తొలుత బీఆర్ఎస్ ఇదే వరంగల్ లోక్ సభ స్థానం నుంచి టిక్కెట్ కేటాయించింది. కానీ తండ్రీకూతురు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లోనూ ఆమెకు టిక్కెట్ దక్కింది.