వాహనదారులకు గుడ్‌న్యూస్.. కొత్త టోల్ రేట్ల అమలు వాయిదా

  • లోక్‌సభ ఎన్నికల తర్వాత అమలు చేయాలని ఎన్‌హెచ్ఏఐకి ఎన్నికల సంఘం ఆదేశం
  • రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభ్యర్థన మేరకు ఈసీ స్పందన
  • టోల్ రేట్లు 5 శాతం పెరగవచ్చునని అంచనా
వార్షిక షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై అమలు చేయాల్సిన కొత్త యూజర్ ఫీజు (టోల్) రేట్లను లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆచరణలోకి తీసుకురావాలని ఎన్‌హెచ్ఏఐని (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రి అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

 కాగా షెడ్యూల్ చేయబడిన టోల్ రుసుము సగటున 5 శాతం మేర పెరగవచ్చుననే అంచనాలున్నాయి. ద్రవ్యోల్బణం మార్పులకు అనుగుణంగా టోల్ రేట్లు ఆధారపడి ఉంటాయని ఎన్‌హెచ్ఏఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. వార్షిక కసరత్తులో ఇది భాగమని వివరించారు. కాగా ఏప్రిల్ 1నే దేశవ్యాప్తంగా ఎక్కువ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ మార్గాలపై కొత్త టోల్ రేట్లు అమల్లోకి రావాల్సి ఉంది.

మరోవైపు విద్యుత్ టారిఫ్‌ సవరణలపై రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ సంఘాలు నిర్ణయం తీసుకోవచ్చునని, అయితే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే అమలు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


More Telugu News