మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా
- రేపు జరగాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 2కు వాయిదా
- పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశమున్నందున వాయిదా వేయాలన్న ఈసీ
- పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యాక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశాలు
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదాపడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండటంతో రేపు... మంగళవారం జరగాల్సిన లెక్కింపు ప్రక్రియను జూన్ 2వ తేదీకి వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు... పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని తెలిపింది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తైన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. దీంతో జూన్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ గత గురువారం జరిగింది. ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను మహబూబ్ నగర్ బాయ్స్ జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు.